calender_icon.png 20 January, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసిడి పంట

19-09-2024 12:00:00 AM

సువ (ఫిజి): ఫిజి వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ యూత్, జూనియ ర్ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. బుధవారం జరిగిన 49 కేజీల యూత్ మెన్ కేటగిరీలో బాబులాల్ జాతీయ రికార్డు నెలకొల్పాడు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో బాబులాల్ 114 కేజీలు ఎత్తి పసిడి కొల్ల గొట్టాడు. ఇక 55 కేజీల యూత్ వుమెన్ కేటగిరీలో మినా సంటా కూడా రికార్డు నెలకొల్పింది. స్నాచ్‌లో 81 కేజీలు ఎత్తిన మినా సంటా క్లీన్ అండ్ జెర్క్‌లో 99 కేజీలు.. మొత్తంగా 180 కేజీలు ఎత్తి స్వర్ణం కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్ 14 పతకాలు (11 స్వర్ణాలు, 3 రజతాలు) సాధించింది.