calender_icon.png 17 November, 2024 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీల అమలుకు పెద్దపీట

26-07-2024 12:05:00 AM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెద్దగా మెరుపులు కనిపించలేదు. ఆర్థికశాఖను నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెం బ్లీలో బడ్జెట్‌ను ప్రతిపాదించగా, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండలిలో బడ్జెట్‌ను సమర్పించారు. 2024 ఆర్థిక సంవ త్సరానికి రూ.2,91,159 కోట్ల అంచనాతో సమర్పించిన ఈ బడ్జెట్‌లో సంక్షే మం, వ్యవసాయం, సాగునీరు, పంచాయతీ రాజ్ రంగాలకు భారీ కేటాయింపులు జరిపారు. మరోపక్క రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరైన హైదరాబాద్ అభివృద్ధికి మొత్తం రూ.11,475 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా చూపించారు.

గత ఏడాది బడ్జెట్‌కూడా దాదాపు ఇంతే పరిమాణంలో ఉండడం గమనార్హం. రాబడి విష యానికి వస్తే పన్నులద్వారా వచ్చే ఆదా యం రూ.1,38,181.26 కోట్లు కాగా, పన్నేతర ఆదాయం రూ. 35, 208.44 కోట్లుగా చూపించారు. కేంద్ర పన్ను ల్లో వాటా రూ.26,216.28 కోట్లు, కేంద్రం గ్రాంట్లు 21,636.15 కోట్లు ఉం టుందని అంచనా వేశారు. మూడు రోజుల క్రితం సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు లేని నేపథ్యంలో అక్కడ్నించి ఏ మేరకు గ్రాంట్లు వస్తాయో తెలియని పరిస్థితి. ఆర్థిక లోటు రూ. 49,255.41 కోట్లు గా ఉండవచ్చని అంచనా. దీనిని భర్తీ చేయడానికి ప్రభుత్వం ఈ ఏడాది రూ.57,112 కోట్లు అప్పులు చేయాలని ప్రతిపాదించింది. వాస్తవ పరిస్థితులకు చేరువగా బడ్జెట్‌ను రూపొందించామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయానికి బడ్జెట్‌లో రూ.72,659 కోట్లు కేటాయించారు. దీనితోపాటు నీటి పారుదల రంగానికి మరో 22,301 కోట్లు,  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.29,816 కోట్లు కేటాయించారు. ఇవన్నీ వ్యవ సాయానికి, రైతులకు దోహదపడే అనుబంధ రంగాలే కావడం గమనార్హం. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకోసమూ బడ్జెట్‌లో పెద్ద మొత్తాలనే కేటాయించారు. ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్లు కేటాయించారు. వీటితోపాటు ఉచితబస్సు ప్రయాణానికి రూ.723 కోట్లు, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ.723 కోట్లు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు రూ.40 వేల కోట్లు కేటాయించారు.

తెలంగాణ మొత్తం ఆదాయంలో 65 శాతం హైదరాబాద్ నుంచే లభిస్తున్న నేపథ్యంలో  జంటనగరాల అభివృద్ధికీ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. రీజినల్ రింగ్‌రోడ్డు, మెట్రోరైలు విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిసహా ఇతర కార్యక్రమాలకు రూ.10 వేల కోట్లు కేటాయించారు. దీని వెనుక రాజకీయ కారణాలు కూడా లేకపోలేదు. జంట నగరాల్లో కాంగ్రెస్ నుంచి నేరుగా గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కరూ లేకపోవడం, బీఆర్‌ఎస్ నుం చి ఫిరాయించిన ముగ్గురు, నలుగురు సభ్యులే దిక్కయిన నేపథ్యంలో రాజధాని అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం లేదన్న సంకేతాన్ని ఇవ్వడమే ఈ కేటాయింపుల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్భాటాలకు పోయి అనవసర పథకాలపై దుబారా చేసిందని, ఫలితంగా ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా భట్టి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతభత్యాలు కూడా సమయానికి ఇవ్వలేని స్థితి ఉండేదని, అందుకే దుబారాలను ఆపేసి ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నామన్నారు. ఇక జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ ఆదాయం ఇప్పటికీ ఎక్కువగానే ఉందని 2023 జాతీయ వృద్ధిరేటు 7.6 శాతం కాగా, తెలంగాణ వృద్ధిరేటు దాదాపు దానితో సమానంగా 7.4 శాతం ఉందని ఆర్థికమంత్రి చెప్పారు. మొత్తం మీద ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే అభివద్ధికి పెద్దపీట వేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ తొలి బడ్జెట్ ఉండడం గమనార్హం.