01-03-2025 08:02:56 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ లో సంగమేశ్వర గుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా రథోత్సవాన్ని నిర్వహించారు. గ్రామ సమీపంలోని హనుమాన్ ఆలయం నుండి గ్రామంలోని హనుమాన్ ఆలయం వరకు రథోత్సవాన్ని గ్రామస్తులు పాల్గొని చేపట్టారు. రథముపై మహాదేవుని విగ్రహాన్ని పెట్టి వతాన్ని పూలతో అలంకరించారు. సాయంత్రం గుట్ట సమీపంలోని హనుమాన్ ఆలయం వద్ద కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 4500 విలువగల వెండి కడియం ద్వితీయ బహుమతి నాలుగు వేల విలువగల వెండి కడియం తృతీయ బహుమతి మూడువేల విలువగల వెండి కడియం నాలుగో బహుమతి 2000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు.