16-12-2024 11:35:43 PM
జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్దగుల్ల గ్రామంలో సోమవారం దత్త జయంతిని పురస్కరించుకొని వారం రోజుల పాటు భజన కీర్తనలు నిర్వహించారు. చివరి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు కుస్తీ పోటీలు చేపట్టారు. దాంట్లో భాగంగా కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు మహరాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి మల్లయోధులు పాల్గొని కుస్తీ పోటీల్లో తలపడ్డారు. ప్రతి సంవత్సరం దత్తజయంతి వేడుకలు ఘనంగా పెద్దగుల్ల గ్రామస్తులు నిర్వహిస్తారు. పోటీల్లో గెలుపొందిన మల్లయోధులకు వెండి కడియాలు, నగదు బహుమతి అందజేస్తారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రుక్మిణి బాయి విఠల్‌రావు, మాజీ జడ్పీటీసీ మాధవ్‌రావు దేశాయ్, సందీప్ పటేల్, జుక్కల్ ఎస్సై భువనేశ్వర్‌రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.