calender_icon.png 24 November, 2024 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాయుతి కూటమి మహా విజయం

24-11-2024 02:19:05 AM

మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రజాతీర్పు

  1. మహారాష్ట్రలో 234 స్థానాల్లో మహాయుతి విజయఢంకా
  2. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 
  3. జార్ఖండ్‌లో ఇండియా కూటమిదే అధికారం
  4. మొత్తం 81 సీట్లకు గాను 56 సీట్లు కైవసం

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటములకే ప్రజలు పట్టం కట్టారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయఢంకా మోగించింది. మొత్తం 288 స్థానాలకుగాను రికార్డుస్థాయిలో 234 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలతో సత్తాచాటాయి. దీంతో వరుసగా మూడోసారి మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టింది. ప్రస్తుతం మహాయుతి తరఫున ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందనే విషయంపై సందిగ్ధం నెలకొంది. కూటమి నేతల ఏకాభిప్రాయంతో ముఖ్యమంత్రి ఎంపిక జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటిన మహావికాస్ అఘాడీ మాత్రం ఈసారి చతికిలబడింది. కేవలం 50 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ (ఎస్పీ) 10 సీట్లు మాత్రమే సాధించాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రభావం చూపినట్లు కనిపించలేదు. మరోవైపు జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంది.

రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాలకుగాను కూటమి 56 సీట్లు సాధించింది. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం 34 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ (ఎంఎల్) 2 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 2౪ స్థానాలకే పరిమితమైంది.

మహారాష్ర్టలో  అద్భుత విజయం

* గత రికార్డులను చెరిపేశాం.. కాంగ్రెస్ కుల రాజ కీయాలను ప్రోత్సహించింది.. మిత్ర పక్షాలనూ ముంచింది.

 ప్రధాని మోదీ