calender_icon.png 21 January, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాకిస్థాన్ ఘన విజయం

21-01-2025 12:05:45 AM

వెస్టిండీస్‌తో తొలి టెస్టు

ముల్తాన్: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో ప్రారంభమైన టెస్టు సిరీస్‌లో ఆతిథ్య పాకిస్థాన్ బోణీ కొట్టింది. ముల్తాన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో పాకిస్థాన్ 127 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయాన్ని అందుకుంది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 123 పరుగులకే కుప్పకూలింది. అలిక్ అతనజె (55) మాత్రమే రాణించగా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ 5 వికెట్లతో చెలరేగగా.. అబ్రర్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ షాన్ మసూద్ (52) అర్థసెంచరీతో రాణించగా.. ముహమ్మద్ హుర్రాఇరా (29) పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో వర్రికన్ 7 వికెట్లతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 230 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 137 పరుగులకు పరిమితమైంది. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు పడగొట్టిన సాజిద్ ఖాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఇదే స్టేడియం వేదికగా జనవరి 25 నుంచి మొదలుకానుంది.