భైంసా (విజయక్రాంతి): భైంసా పద్మావతి కాలనీలోని శ్రీలక్ష్మి వేంకటేశ్వరాలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముథోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్, స్థానిక భక్తులు ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శించుకుని పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వేధపండితులు, ఆలయ నిర్వహకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.