calender_icon.png 28 February, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవి విరమణ చేసిన రాజన్నకు ఘనంగా సన్మానం

28-02-2025 06:01:12 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): 37 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన కాసిపేట 1 గని మెకానికల్ పోర్ మెన్ వోడ్నాల రాజన్న ను యాజమాన్యం, ఉద్యోగ సంఘాల నాయకులు,ఉద్యోగులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. రాజన్న 23 సంవత్సరాలు కాసిపేట గనిలో పిట్టర్, మెకానికల్ ఫోర్ మెన్ గా పని చేశారు.గని పిట్ సెక్రెటరీ గా, టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంలో ఏరియా కార్యదర్శి గా, వర్క్ మెన్ ఇన్సఫెక్టర్గ్ గా పని చేశారు. వారిని మేనేజర్ భూశంకరయ్యగ శాలువా, జ్ఞాపికను అందచేసి సన్మానించారు. అనంతరం గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆధ్వర్యంలో బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్, వైస్ ప్రెసిడెంట్ బియ్యల వెంకట స్వామి, పిట్ సెక్రెటరీ మీనుగు లక్ష్మీ నారాయణ ఘనంగా సన్మానించారు.

బెల్లంపల్లి మాజీ శాసన సభ్యులు దుర్గం చిన్నయ్య, వైస్ ప్రెసిడెంట్ మెడిపెళ్లి సంపత్, నాయకులు జె రవీందర్, ఓ.రాజశేఖర్, ముఖ్య నాయకులు సన్మానించారు. ఐఎన్టియుసి కేంద్ర ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మన్ దాస్, కార్యవర్గ సభ్యులు మీద సమ్మయ్య, పిట్ సెక్రెటరీ రవీందర్, కన్నయ్య, రాజన్న, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నాయకులు కనుకుల తిరుపతి, కృష్ణ, ఎస్టి అసోసియేషన్ లైజన్ అధికారి బాబు, దరవత్ తిరుపతి, సిఐటియు నాయకులు వెంకట స్వామి, దెబ్బడి తిరుపతి, ఉద్యోగ సంఘాలు, మున్నూరు కాపు సంఘం మండల నాయకులు సిద్ధం తిరుపతి, అగ్గి సత్తయ్య, ఉష్కామల్ల గోపాల్, బాపు, రాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షలు, మాజీ సర్పంచ్ వేముల కృష్ణ సన్మానించారు. అనంతరం ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్ మాట్లాడుతూ... రాజన్న మంచికి మారుపేరని, సమస్యను పరిష్కరించడంలో ముందుంటారని అన్నారు.

మేనేజర్ భూశంకరయ్య మాట్లాడుతూ... కంపెనీకి ఉద్యోగులకు వారధిగా ఉంటూ మంచి సంబంధాలు కొనసాగించారని వారు ఉత్పత్తి, రక్షణ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించారని అన్నారు. అనంతరం రాజన్న మాట్లాడుతూ.. గని కార్మికుల, అధికారుల సహకారం వల్లనే తనకు గుర్తింపు, గౌరవం లభించిందని, ఇంటి నుండి హెల్మెట్ పెట్టుకొని రావాలని, యువ కార్మికులు బాద్యతతో పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి రవీంద్ర నిఖిల్,డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, ఇంజనీర్లు మధుకర్, సంక్షేమ అధికారి మీర్జా జిస్ జీషాన్, ఏఐటీయూసీ పిట్, సేఫ్టీ కమిటీ నాయకులు రాజేందర్, ఆంజనేయులు, అనిల్, రవీందర్, రంజిత్, అన్ని యూనియన్లు నాయకులు పాల్గొన్నారు.