బైంసా (విజయక్రాంతి): బైంసా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక నరసింహ కళ్యాణ మండపంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. యువతులు బాలికలు పెద్ద మొత్తంలో పాల్గొని రంగవల్లు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రామారావు పటేల్(MLA Rama Rao Patel) హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు.