calender_icon.png 24 November, 2024 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా విజయం అభివృద్ధికి దిక్సూచి

24-11-2024 04:04:27 AM

మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ 

మహబూబ్‌నగర్, నవంబర్ 23 (విజయక్రాంతి): మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి విజయం అభివృద్ధికి దిక్సూచిలాంటిదని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో శనివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం అరుణ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో తెలంగాణ ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లి ప్రచారం చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింద న్నారు.

పీఎం మోదీతోపాటు అగ్రనేతలను నమ్మి బీజేపీకి పట్టం కట్టారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు గుజరాత్, మహారాష్ట్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ప్రసంగాలు చేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కొడంగల్  నియోజకవర్గంలో ఏమి జరగుతుందో తెలియని పరిస్థితిలో సీఎం రేవంత్‌రెడ్డి ఉండటం దురదృష్టకరమని అన్నారు. తన ఇంటికి బాట లేకుండా చేయడంతోనే సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నా సీఎం స్పందించక పోవడం దారుణమన్నారు.

సాయిరెడ్డి  ఆత్మహత్యను సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేసి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, పద్మజారెడ్డి, తదితరులు ఉన్నారు.