calender_icon.png 5 December, 2024 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్ కళకళ

15-09-2024 01:21:42 AM

నల్లగొండ, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతున్నది. రిజర్వాయర్‌కు 77,658 క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు 4 క్రస్టుగేట్లను 5 అడుగుల మేర ఎత్తి స్పిల్ వే నుంచి 32,400 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నీటి మట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా శనివారం పూర్తిస్థాయికి చేరింది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ 29,191 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.