calender_icon.png 10 October, 2024 | 8:47 PM

ఘనంగా సద్దుల బతుకమ్మ

10-10-2024 06:11:26 PM

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రం లో ఉన్న చేగుంట, మక్కారాజ్ పేట్, చందాయి పేట్, వడియారం, పొలంపల్లి, బోనాల, తదితర గ్రామ లలో గురువారం సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు, యువతులు ఉత్సాహం చూపారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బతుకమ్మను సిద్ధం చేయడానికి కావలసిన వివిధ రకాల ఆకులు, పువ్వులను సేకరించడంలో యువతి యువకులు నిమగ్నమయ్యారు. సద్దుల బతుకమ్మకు చామంతి, బంతి, తంగేడు, గూనుగు, తామెర, సీతమ్మ జడ, గుమ్మడి, బీర పూలతో పాటు వివిధ రకాల పూలతో మహిళలు బతుకమ్మను పెర్చారు. మహిళలు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ముందుగా పసుపుతో, గౌరమ్మలను పూజించి సద్దుల బతుకమ్మలను తీరొక్క పూలతో పేర్చడంలో నిమగ్నమయ్యారు. అందంగా అలంకరించిన సద్దుల బతుకమ్మలకు నైవేద్యంగా పెట్టడానికి పిండితో సత్తులను తయారు చేసుకుని ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ, ఆటలు ఆడుకుంటూ చెరువులోకి వెళ్లి అందులో వేయడం జరిగింది, అనంతరం మహిళలు పసుపు కుంకుమ పంచుకోవడం జరిగింది.