calender_icon.png 30 October, 2024 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబ్ మేళాకు విశేష స్పందన

07-07-2024 12:05:00 AM

యాదాద్రి భువనగిరి, జూలై 6 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో కృషి ఐటీఐ, సమర్ధనం ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. సాయికృప పీజీ, డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ జాబ్‌మేళాలో 956 మంది అభ్యర్థులు వివిధ ఉద్యోగాల కోసం హాజరుకాగా, 118 మంది అర్హత సాధించినట్టుగా నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సమర్ధనం ట్రస్ట్  పాన్ ఇండియా ప్లేస్‌మెంట్ హెడ్ కే సతీశ్ మాట్లాడుతూ, కృషి ఐటీఐ, సాయికృప డిగ్రీ పీజీ కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్‌కుమార్, డీఆర్‌డీఏ జేడీఎం కొత్తపల్లి రాజు, రీజినల్ హెడ్ శ్రీనివాస్, సెంటర్ హెడ్ నల్లపు శ్రావణ్ కుమార్, కృషి ఐటీఐ ప్రిన్సిపాల్ రామోజీ రమేశ్, వాగ్దేవి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్  శ్రావణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.