calender_icon.png 11 October, 2024 | 6:59 PM

Breaking News

గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ప్రారంభం

11-10-2024 12:00:00 AM

తిరువీర్ కథానాయకుడిగా నటించనున్న కొత్త సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్.. బై 7పీఎం ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై తెరకెక్కిస్తున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ టీనా శ్రావ్య కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సందీప్ అగరం, అష్మితారెడ్డి నిర్మాతలు. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. 

ముహూర్తపు సన్నివేశానికి రానా దగ్గుబాటి క్లాప్ కొట్టగా, సందీప్ అగరం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాహుల్ శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను కామెడీ డ్రామా జానర్‌లో రూపొందిస్తున్నాం. ఎస్.కోట, వైజాగ్ ప్రాంతాల్లో నవంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను జరుపబోతున్నాం’ అని తెలిపారు.