06-04-2025 12:11:59 AM
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
రాజేంద్రనగర్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): మనందరం మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆరంగర్ చౌరస్తాలో మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజ రై ప్రసంగించారు.
అదేవిధంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బిజెపి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి, బి ఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కార్తీక్ రెడ్డితో పలువురు ప్రముఖులు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని గండిపేట, రాజేం ద్రనగర్ శంషాబాద్ దగ్గర ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి.