ఆదిత్య పరాశ్రీ గురువు ప్రభుత్వ పాఠశాలకు మైకు, బ్యాండును అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్
నారాయణపేట. జనవరి 26 (విజయ క్రాంతి): దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను విద్యార్థులు, యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని శ్రీశ్రీశ్రీ అంబాత్రయ క్షేత్రం, త్రిశక్తి పీఠం వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ డాక్టర్ ఆదిత్య పరాశ్రీ గురువు పిలుపునిచ్చారు. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరిం చుకుని నారాయణపేట జిల్లా పెద్దజట్రం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన వేడుకలకు గురూజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రూ.61 వేల విలువైన మైకు, బ్యాండులను ఫౌండేషన్ సభ్యులు పాఠశాల నిర్వాహకులకు అందజేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన గురూజీని, భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులను పాఠశాల నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, బాలాజీ, మధుసూదన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, నర్సింహులు, శివరాజ్, కృష్ణ, ఎం.సంతోష్, నర్సింహనాయుడు, వెంకటరావు, శ్రీనివాస్, ఉపాధ్యాయులు అనిల్, బాలప్ప, గోపాల్, వెంకటరెడ్డి, గ్రామస్థులు, గ్రామపెద్దలు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.