calender_icon.png 15 November, 2024 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కార్తీక మాసోత్సవాలు

15-11-2024 03:44:44 PM

కరీంనగర్ (విజయక్రాంతి): స్థానిక వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్ లో పండుగ వాతావరణం తలపించే విధంగా కార్తీకపౌర్ణమి ఉత్సవాలను "అల్ఫోర్స్ కార్తీక మాసోత్సవ్” పేరుతో నిర్వహించారు. వేదమంత్రోత్సారణల మధ్య జ్యోతిప్రజ్వలన చేసి శివకేశవుల చిత్రపటానికి పూలమాల వేసి పూజను ఆచరించి విద్యార్థులకు కార్తీక మాస విశిష్టతను తెలియజేశారు. ఈ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్తీకమాసంలో అనేక పూజాది కార్యక్రమాలను సంబరంగా నిర్వహించడం జరుగుతుందని, చాలామంది కార్తీక మాసంలో వివిధ రకాలుగా దానాలను చేస్తారని తద్వారా వారు ఆనందమైన జీవితాన్ని గడుపుతారని పలు పురాణాల ద్వారా స్పష్టంగా తెలుస్తున్నదని చెప్పారు. మాసాలలో కార్తీకమాసం శివునికి అత్యంత ప్రీతికరమైనదని, శక్తివంతమైనదని చెప్పారు.

కార్తీకమాసంలో చాలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని పాపాల నుండి విముక్తి పొందడానికై ప్రాతకాల సమయాన నది తీరాన ఉన్నటు వంటి దేవాలయాలను నదిస్నానం చేసి సందర్శించి దీపదానాలు చేస్తారని తెలుపుతూ ప్రతి వ్యక్తి కూడా కార్తీక మాసం యొక్క విశిష్టతను తప్పని సరిగా తెలుసుకోవాలని తెలిపారు. వేడుకలను పురస్కరించుకొని విద్యార్థులు కార్తీక శోభ తలపించే విధంగా నృత్యాలను చేశారు. ప్రత్యేకంగా విద్యార్థులు ప్రదర్శించిన "కార్తీక మాస మహత్యం" నాటిక అద్యంతం ఆకట్టుకున్నది. మరికొందరు విద్యార్థులు కార్తీకమాసం విశిష్టతను తెలిపేవిధంగా చేసినటువంటి దీపదానం, వనభోజనాలు, సత్యనారాయణస్వామి వ్రతం, లక్ష్మిపూజ కార్యక్రమాలు చాలా ఆకర్షణీయంగా నిలిచాయి. సుమారు 20 మంది విద్యార్థులు పార్వతీ-పరమేశ్వరుల వేషధారణలో విచ్చేసారని 100 మందికి పైగా విద్యార్థులు సాంప్రదాయదుస్తుల్లో విచ్చేసి పాఠశాలలో నిర్వహించినటువంటి కార్తీక మహెూత్సవానికి మరింత వన్నె తెచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.