calender_icon.png 26 October, 2024 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గణేశుడి నిమజ్జనాలు

12-09-2024 12:03:39 AM

హుస్సేన్ సాగర్‌తో పాటు కోలాహలంగా మారిన గ్రేటర్ చెరువులు 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 11 (విజయక్రాంతి): గణేశుడి నిమజ్జనాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. దీంతో గ్రేటర్ పరిధిలోని హుస్సేన్ సాగర్‌తో పాటు పలు చెరువులు, కుంటల వద్ద కోలాహలం నెలకొంది. భక్తుల విశ్వాలకు అనుగుణంగా ఉత్సవాలు ప్రారంభమైన 3వ రోజు, 5వ రోజు నుంచి నిమజ్జనాలను ప్రారంభిస్తారు. ఈ నెల 7న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కాగా, 5వ రోజైన బుధవారం పలువురు నిమజ్జనాలు నిర్వహించారు.

హుస్సేన్ సాగర్ ఎన్టీయార్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో వినాయక నిమజ్జనాలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రస్తుతం నిమజ్జనానికి హైకోర్టు ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో హుస్సేన్ సాగర్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అవకాశం లేదు. హుస్సేన్ సాగర్ కలుషితం కాకుండా కేవలం మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే నిమజ్జనానికి అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన పాండ్స్‌లో మాత్రమే పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అవకాశం ఉంది. ఈ పాండ్స్‌లో కేవలం 3 అడుగుల విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయనుండడంతో చిన్న చిన్న విగ్రహాలు మాత్రమే సాగర్ చెంతకు తరలివచ్చాయి.