calender_icon.png 10 January, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అథ్లెటిక్స్ లో రాణించిన అంగన్వాడి టీచర్ కు ఘనసన్మానం

10-01-2025 05:56:26 PM

ఏజెన్సీలో రాణించిన ఆణిముత్యం... 

మణుగూరు (విజయక్రాంతి): అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తూనే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ లొ ప్రతిభ కనబరచిన అంగన్వాడి టీచర్ కనితి కృష్ణవేణి కి గ్రామస్తులు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టుదల,కృషి ఉంటే వయసు అడ్డురాదని నిరూపించిన అథ్లెట్ కణితి కృష్ణవేణి ప్రతిభ అభినందనీయమని అన్నారు. జనవరి 4,5 తేదీల్లో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ కంపిటేషన్లో 100 మీటర్స్ లో మూడవస్థానము... 200 మీటర్స్ లో రెండవ స్థానం లాంగ్ జంప్ లో రెండవ స్థానం 4×100 రిలేలో మూడవ బహుమతిలను సాధించిన బూర్గంపహాడ్ మండలం తాళ్లగొమ్మూరు గ్రామ అంగన్వాడీ టీచర్ కణితి కృష్ణవేణి మండలానికే గర్వకారణమని కొనియాడారు.

ఈ సందర్భంగా తాళ్ళగొమ్మూరు గ్రామ పెద్దలు, మండల అంగన్వాడీ టీచర్లు, స్థానిక నాయకులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తాళ్ళగొమ్మూరు అంగన్వాడీ కేంద్రంలో కణితి కృష్ణవేణికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పెద్దలు మాట్లాడుతూ.. ఈ రోజుల్లో మహిళలు ఏంతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారని కృషి పట్టుదల ముందు వయసు అడ్డుకాదని ఈ విజయాన్ని అందుకోవటానికి ప్రోత్సహించి సహకరించిన ఆమె భర్త రాజు తమ ఇద్దరు పిల్లల సహకారం కూడా గర్వించదగినదని తెలిపారు.

కణితి కృష్ణవేణి మాట్లాడుతూ... ఆమెకు సహకరించిన కుటుంబ సభ్యులకు ఆమెకు సాధన ఇచ్చి ప్రోత్సహించిన కోచ్ కు ఇంతటి అభిమానంతో తనను సన్మానించిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఫిబ్రవరి నెలలో కేరళ రాష్ట్రంలో జరగబోయే నేషనల్ అథ్లెటిక్స్ లో అవకాశం సంతోషంగా ఉందని, సాధన చేసి తప్పకుండా విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రామరావు, బెల్లంకొండ వాసుదేవరావు, తాళ్లగొమ్మూరు మాజీ సర్పంచ్ కోయల పుల్లారావు, తాతా మాధవీ లత, బేబీ, తేజవత్ మంగీలాల్, హెడ్ మాస్టర్ కోటేశ్వరరావు, వడ్లమూడి కుమారి, అంగన్వాడీ టీచర్ అనసూర్య, కోచ్ ధర్మారావు, గిరి తదితరులు పాల్గొన్నారు.