28-02-2025 05:57:15 PM
మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని కాసీపేట గనిలో విధులు నిర్వహిస్తు పదవి విరమణ పొందుతున్న టీబీజీకేస్ కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఓడ్నాల రాజన్నను టీబీజీకేఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. శుక్రవారం గనిపై నిర్వహించిన కార్యక్రమంలో కార్మిక దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి మాజి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ... మలిదశ తెలంగాణ ఉద్యమంలో, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో ఒద్నాల రాజన్న క్రియాశీల పాత్ర పోషించారని ఆయన సేవలను ఆయన కొనియాడారు.
కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందుండే రాజన్నను పలువురు కార్మికులు నాయకులు ఆదర్శంగా తీసుకొని కార్మిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిపిజికేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, బిఆర్ఎస్ పార్టి పట్టణ అధ్యక్షుడు జే రవీందర్, సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ, ఓ రాజశేఖర్, సెంట్రల్ నాయకులు సీహెచ్ వెంకటరమణ, నాయకులు ఇప్ప సమ్మయ్య, వీరారెడ్డి, సీపెల్లి రాజలింగు, బెల్లం అశోక్, బైరి శంకర్, అఫ్జలుద్దీన్, కొప్పుశ్రీనివాస్, తిరుపతి, బెల్లం అరుణ్, రంజిత్, అందే శ్రీకాంత్, రామునూరి రాజేష్, పాణి ప్రతాప్, సీనియర్ నాయకులు, యువ నాయకులు, పాల్గొన్నారు.