calender_icon.png 23 January, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్ర ఘనం.. అభివృద్ధి శూన్యం

23-01-2025 12:04:19 AM

  1. ఆధునీకరణకు నోచుకోని ఆసిఫాబాద్ బస్టాండ్
  2. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): నిజాం కాలంలో ఏర్పాటు అయిన ఆసిఫాబాద్ డిపో, బస్టాండ్‌కు ఎంతో చరిత్ర ఉంది. కానీ అభివృద్ధిలో మాత్రం ముందుకు వెళ్లడం లేదు. దాదాపు 95 ఏళ్ల చరిత్ర ఉన్న ఆసిఫాబాద్ డిపో, బస్టాండ్ ఆధునీకరణకు నోచుకోక బస్టాండ్ శిథిలావస్థకు చేరింది.

జిల్లా ఏర్పాటు అవ్వడంతో ప్రయాణికుల రద్దీ పెరిగినా వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ ఐదు ప్లాట్‌ఫాంలకే పరిమతం అయ్యింది. ఇక్కడి నుంచి చంద్రపూర్, రాజుర, ఆదిలాబాద్, ఉట్నూర్, కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్, తిర్యాణి, మంచిర్యాల, బెజ్జుర్, హైదరాబాద్, కరీంనగర్ ఇలా అనేక ప్రాంతాలకు సర్వీసులు నడుస్తున్నాయి.

గతంలో నిజా  షిర్డీ, గుంటూరు, పామురుకు సైతం బస్సులు నడిచేవి. ప్రస్తుతం సంస్థ ఆ సర్వీస్‌లను రద్దు చేసింది. డిపో పరిధిలో 87 బస్సులుండగా 81 బస్సులు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఇందులో 28 హెర్ బస్సులు ఉన్నాయి. రోజుకు 34 వేల కిలో మీటర్లు బస్సులు నడుస్తున్నాయి.

సుమారుగా రూ.19 లక్షల ఆదాయం వస్తుంది. అయినప్పటికీ సరిపడా ఫ్లాట్ ఫాంలు లేకపోవడంతో చెట్ల కిందే బస్సులను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఫ్లాట్‌ఫాం మీదకు బస్సు వెళ్లాలంటే అక్కడ ఉన్న మరో బస్సు కదలాల్సిందే.

నిధుల కేటాయింపుల్లో మొండి చేయి

ఆర్టీసీ డిపో, బస్టాండ్ ఒకే చోట ఉన్నాయి. బస్టాండ్‌ను ఆధునీకరించేందుకు కావాల్సినంత స్థలం సైతం అందుబాటులో ఉంది. బస్టాండ్ ఆవరణలో అర్థిక వనరులను సమకూర్చేందుకు సంస్థ చర్యలు చేపడుతున్నప్పటికీ బస్టాండ్ అభివృద్ధికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.

ప్రయాణికుల సౌకర్యం కోసం రాష్ట్రంలో కొత్తగా బస్ డిపోలు, బస్టాండ్‌లను అందుబాటులోకి తీసుకువస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇందులో భాగంగా నిధులు కూడా కేటాయించారు. కానీ ఎంతో చరిత్ర గల ఆసిఫాబాద్ బస్టాండ్‌కు మాత్రం మొండి చేయే మిగిలింది.

వసతులు కల్పించాలి

ఆసిఫాబాద్ బస్టాండ్‌ను అభివృద్ధి చేసి, ప్రయా  అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించారు. జిల్లా ఏర్పాటు తర్వాత ప్ర  రద్దీ పెరిగింది. బస్టాండ్ కట్టిన సమయంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. బస్సుల సర్వీసులు పెరగడంతో బస్టాండులో ప్రజలకు అసౌ  మారింది. ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ బస్టాండ్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి. 

 దివాకర్, కార్మిక సంఘం నాయకుడు, ఆసిఫాబాద్