calender_icon.png 16 January, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదరగొట్టిన ప్రాచీ, యశ్ కుమార్

07-09-2024 01:39:29 AM

  1. పారా కనోయ్‌లో సెమీస్‌కు 
  2. పవర్‌లిఫ్టింగ్‌లో కస్తూరికి 8వ స్థానం

పారిస్: పారాలింపిక్స్‌లో శుక్రవారం పారా కనోయింగ్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల విభాగం నుంచి యశ్ కుమార్.. మహిళల విభాగం నుంచి ప్రాచీ యాదవ్ సెమీఫైనల్లో అడుగుపెట్టారు. పురుషుల కెఎల్1 200 మీ హీట్‌d రేసులో పోటీ పడిన యశ్ కుమార్ గమ్యాన్ని (నిమిషం 3.27 సెకన్లు) చేరుకొని ఆరో స్థానంలో నిలిచాడు. ఇక మహిళల వీఎల్2 200 మీ హీట్ 1లో పోటీ పడిన ప్రాచీ యాదవ్ రేసును (నిమిషం 6.83 సెకన్లలో) పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలవగా..  శనివారం సెమీఫైనల్ పోటీలు జరగనున్నాయి.

ఇక ఒక్కో హీట్ నుంచి టాప్‌లో నిలిచిన అథ్లెట్ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టగా.. మిగిలినవాళ్లు సెమీస్‌కు వెళ్తారు. సెమీస్‌లో టాప్ లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్‌కు వెళ్లనున్నారు. ఇక పారాలిఫ్టింగ్‌లో మరోసారి భారత్‌కు నిరాశే ఎదురైంది. శుక్రవారం మహిళల 67 కేజీల పారాలిఫ్టింగ్ ఫైనల్లో భారత్ నుంచి పోటీ పడిన కస్తూరి రాజమని 8వ స్థానంలో నిలిచింది. తొలి ప్రయత్నంలో విఫలమైన కస్తూరి రెండో ప్రయత్నంలో 106 కేజీలు ఎత్తగా.. మూడో ప్రయత్నంలో 110 కేజీలు బరువును లిఫ్ట్ చేయడంలో విఫలమైంది.