15-03-2025 08:05:55 PM
దేవాలయ చైర్మన్ అమరనాయిని వెంకటేశ్వరరావు..
కోదాడ (విజయక్రాంతి): కోదాడ మండలం, తొగర్రాయి గ్రామంలోని ప్రముఖ శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. దేవాలయ చైర్మన్ అమరనాయిని వెంకటేశ్వరరావు, వేద పండితులు నల్లాన్ చక్రవర్తుల రామకృష్ణ ఆచార్య, రాజన్ ఆచార్య, దేవాలయ అర్చకులు ముడుంబ విష్ణువర్ధన ఆచార్య, గ్రామ పురోహితులు రాకేష్ శర్మ, నందుల లక్ష్మీనరసింహశాస్త్రి, యాదా రమేష్, శ్రీనివాసరావు, అచ్యుతారాం, దేవరశెట్టి నారాయణరావు, దేవాలయ కమిటీ సభ్యులు సింగరయ్య, ఏడుకొండలు, ఉపేందర్, గోపిరెడ్డి, యర్రయ్య, పల్లె బాబు,దొంగల అనిత, నాగమణి, లింగేశ్వరి, లక్ష్మి, రాంబాయి, అరుణ పాల్గొన్నారు