calender_icon.png 1 March, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధుల మంజూరు మీ బాధ్యతే!

01-03-2025 12:48:33 AM

  1. మీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం..
    1. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి నిధులు మం జూరు చేయించడంలో  కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డికి బాధ్యత ఉందని అన్నారు.

రాష్ట్రాలకు ప్రాజెక్టుల మంజూరులో కేం ద్రానికి ఒక విధానం ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా సీఎం రేవంత్‌రెడ్డి శనివారం 9 పేజీల బహిరంగ లేఖను రాశారు.  ‘కేంద్రమంత్రి హోదాలో ఉన్న మీ వ్యాఖ్యలు పూర్తి బాధ్యతారాహిత్యం గా ఉన్నాయి. 

మెట్రో ఫేజ్ ఆర్‌ఆర్‌ఆర్, మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రిం గ్ రైలు, డ్రైపోర్టు నుంచి ఏపీలోని బంద ర్ సీపోర్టుకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతులు,  హైదరాబాద్ సి వరేజ్, వరంగల్ అండర్‌గ్రౌండ్ సివరేజ్ వంటి పలు ప్రాజెక్టుల కోసం ఎన్నిసార్లు కేంద్రమంత్రులను, అధికారులను కలిసినా ఉపయోగం లేదు. మేము సిస్టం ఫాలో అయ్యాం.

కానీ కేంద్రమే పక్కన పెట్టింది’ అంటూ సీఎం ఘాటుగా విమర్శించారు. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా ఉం డగానే చెన్ను, బెంగళూరు మెట్రో విస్తరణకు ఆమోదం లభించిందని, కానీ హైద రాబాద్ మెట్రోపై మాత్రం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పురోగతి లేదని సీఎం రేవంత్ ఆ లేఖలో పేర్కొన్నారు. “కేం ద్ర క్యాబినెట్‌లో తెలంగాణ నుంచి మీరు కొనసాగుతున్నారు. 

రాష్ర్ట ప్రజా ప్ర యోజనాలే లక్ష్యంగా రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు మంజూరు చేయిం చాల ని కోరాం. ఇదే విషయాన్ని నేను ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని, మ మ్మల్ని అడిగే హామీలు ఇచ్చారా..?  అం టూ విమర్శలు చేస్తున్నారు. కేంద్రమంత్రులను కలవడం, ఆయా శాఖలు అడి గిన వివరాలు అందజేయడం,  ప్రధానమంత్రిని కలిసి అందజేయడంతో పాటు మిమ్మల్ని కలిసి అన్నీ వివరించిన తర్వా త కూడా మాపై విమర్శలు చే యడం తీవ్ర అభ్యంతరకరం.

కేంద్ర క్యాబినెట్‌లో ఉన్న మీరు తెలంగాణకు చేసిందేమిటో తెలియజేయండి. కేంద్రమంత్రిగా ఏం సాధించలేని మీరు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం సమంజసం కాదు. ఇకనైనా రాష్ట్రానికి సంబంధించిన రూ. 1,63,559.31 కోట్ల ప్రాజెక్టుల అనుమతులు, నిధుల మం జూరుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి” అని లేఖలో సీఎం రేవంత్ కోరారు.