calender_icon.png 21 January, 2025 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొమ్మిది ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించండి

21-01-2025 01:21:54 AM

  1. ఉదారంగా నిధులు విడుదల చేయించండి..
  2. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి వినతి

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): తెలంగాణవ్యాప్తంగా తొమ్మిది ప్రాజెక్ట్‌లకు అనుమతులు ఇప్పించాలని, వాటికి ఉదారంగా నిధులు విడుదల చేయించేందుకు సహకరించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సోమవారం కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రిని కోరారు. ఒడిశాలోని కోణార్క్‌లో జరిగిన రాష్ట్రాల బొగ్గు, గనులశాఖ మంత్రుల జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతి అందించారు.

విజ్ఞప్తులు ఇలా..

* ప్రాంతీయ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్): 350 కి.మీ మేర రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి రూ. 34,367.62 కోట్లు ఖర్చవుతాయి. ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇప్పించడంతో పాటు భూసేకరణకు సహకరించాలి. ప్రాజెక్ట్‌కు వెచ్చించే నిధుల్లో రాష్ట్ర ప్రభు త్వం 50శాతం ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉంది. మిగిలిన నిధులను కేంద్రం నుంచి ఇప్పించాలి. 

* రేడియల్ రోడ్ అభివృద్ధి: హైదరాబాద్ మెట్రో కారిడార్‌లోని 10 కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ల అభివృద్ధితో నగర విస్తరణకు ప్రణాళిక రూపొందించాం. ప్రాజెక్ట్‌కు రూ.45,000 కోట్లు ఖర్చు అవుతుంది. 

* మెట్రో రైల్ ఫేజ్ హైదరాబాద్ మెట్రో ఫేజ్--2కు సంబంధించి మొత్తం 76.4 కి.మీ మేర కొత్త కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 కోట్లు అవసరమ వుతాయి. 

* మూసీ పునరుజ్జీవం: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ అభివృద్ధికి రూ.14,100 కోట్లు వ్యయం.

* గోదావరి -మూసీ నదుల 

అనుసంధానం: గోదావరి నుంచి 5 టీఎంసీల జలాలను మళ్లించి మూసీని శుద్ధి చేసేందుకు రూ.7,440 కోట్లు అవసరం.

* హైదరాబాద్ నగరానికి సీఎంపీ: హైదరాబాద్ నగరానికి 7,444 కి.మీ పొడవునా సీవరేజ్ మాస్టర్ ప్లాన్ (సీఎంపీ) రూపొందించాం. ప్రాజెక్ట్‌కు రూ.17,212.69 కోట్లు అవసరం.

* వరంగల్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రణాళిక: రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లో సమగ్ర డ్రైనేజీ ప్రణాళిక ప్రాజెక్టుకు రూ.4,170 కోట్లు అవసరమవుతాయి.

* గ్రీన్ ఫీల్డ్ హైవే: ఏపీలోని బందర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ మధ్య ఎక్స్‌ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి రూ. 17,000 కోట్లు అవసరం. పైన పేర్కొన్న ప్రాజెక్ట్‌లన్నింటికీ కేంద్రం ఉదారంగా నిధులు విడుదల చేయాలి.

* సింగరేణి బొగ్గు బ్లాక్ కేటాయింపు: తెలంగాణలోని గోదావరి వ్యాలీ బొగ్గు బ్లాక్‌లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు కేటాయియించేందుకు సహకరించాలి.

* సెమీకండక్టర్ మిషన్: సెమీకండక్టర్ మిషన్‌లో భాగంగా హైదరాబాద్ అనుకూలమైన నిర్ణయాలను కేంద్రం తీసుకోవాలి.