calender_icon.png 1 April, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖబరస్థాన్ స్థలానికి అనుమతి మంజూరు చెయ్యండి

24-03-2025 05:38:50 PM

ప్రజావాణిలో మనవి..

జిల్లా మైనారిటీ అధ్యక్షుడు యండి యాకూబ్ పాషా.. 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లాలోని చుంచుపల్లి మండలం వెంకటేశ్వర కాలనీలో ముస్లిం స్మశానవాటికకు స్థలాన్ని కేటాయిస్తూ చుంచుపల్లి తహశీల్దార్ 2022 పంపిన నివేదిక ఆమోదిస్తు వెంటనే ఆదేశాలు జారీ చెయ్యాలని జిల్లా మైనారిటీ అధ్యక్షులు యండీ యాకూబ్ పాషా సోమవారం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ ను కోరారు. చుంచుపల్లి మండల పరిధిలో ముస్లింల స్మశానవాటిక స్థలాన్ని కేటాయించాలని 2022 ఫిబ్రవరిలో ప్రజావాణిలో ఆనాటి కలెక్టర్ ను కోరగా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని తహశీల్దార్ కు చెప్పడంతో సర్వే నెం. 137/1లో గల ప్రభుత్వ భుమి నుంచి 1 ఎకరం స్థలాన్ని కేటాయిస్తూ,  ఆమోదం కోసం నక్షతో పాటు ఆర్డీవో ద్వారా 2022 సెప్టెంబర్ 30న నివేదినకు కలెక్టర్ కార్యాలయానికి పంపడం జరిగిందన్నారు. మూడు సంవత్సరాలు గడిచిందని, నేటి వరకు అనుమతి ఇవ్వలేదని, ఇట్టి విషయాన్ని గత నవంబర్ లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని, కావున వెంటనే చుంచుపల్లి మండలంలోని వెంకటేశ్వర కాలనీలో ముస్లిం ఖబరస్థాన్ స్థలానికి అనుమతి ఇవ్వాలని కోరారు.