calender_icon.png 23 March, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారి అభివృద్ధి నిధులు మంజూరు

22-03-2025 06:19:31 PM

బైంసా (విజయక్రాంతి): నర్సాపూర్ మండలంలోని అర్లీకే గ్రామంలో పంటచేలకు వెళ్లడానికి రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 2 లక్షలు నిధులు మంజూరు చేసిందని గ్రామస్తులు తెలిపారు. వ్యవసాయ భూములకు రహదారి లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సమస్యను ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి విట్టల్ రెడ్డికి విన్నవించగా సమస్యను సత్వరమే ఆయన స్పందించారని తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లగా రూ.నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు శనివారం మొరం పనులను ప్రారంభించినట్లు గ్రామస్తులు తెలిపారు.