రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి (విజయక్రాంతి): సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోల్రం క్యాంప్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలో పర్యటించారు. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీలో వీధిలైట్లు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని స్థానికులు పోచారం శ్రీనివాస్ రెడ్డిని కోరడంతో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ తాసిల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో బషీరుద్దీన్, విద్యుత్ శాఖ ఏ ఈ అనిల్ కుమార్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఎజాజ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.