calender_icon.png 26 December, 2024 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు

08-11-2024 05:08:51 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ యోజనలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు మంజూరైనట్లు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సారంగాపూర్ మండలంలోని కౌట్ల గ్రామం నుండి అడళి పోచమ్మ ఆలయం వరకు ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టే రోడ్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ. 2 కోట్ల 20 లక్షలతో ఈ రోడ్డు అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.