23-04-2025 12:58:05 AM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హనుమకొండ, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): హసన్ పర్తి ఎమ్మార్వో ఆఫీస్ నుంచి ఎల్లాపూర్ గ్రామం వరకు రోడ్డు చిన్నగా ఉండి రోడ్డు ప్రమాదంలో చాలా మంది మరణిస్తున్నారనీ స్థానికుల అభ్యర్థన మేరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సంబంధిత అధికారులతో వివరాలు తెప్పించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత రోడ్డు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ల దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే స్పందించి రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేందుకు తక్షణమే 2 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది.
ఈరోజు ప్రత్యక్షంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, నేషనల్ హైవే, పోలీస్, మున్సిపల్, ఎలక్ట్రికల్, అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్వయంగా పర్యవేక్షించి అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు.
ఎమ్మెల్యే దృష్టి సారించి ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టి 2 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి, రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని తెలియజేయడంతో స్థానిక ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నాగరాజు కు, నాయకులకు అధికారులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.
హనుమకొండ జిల్లా కిసాన్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, హాసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, ఆత్మకూర్ ఏఎంసి మాజీ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి, 66వ డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్, అయ్యాల రాంరెడ్డి, మండల, డివిజన్, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.