మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్...
మంథని (విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చోరవతో మంథని నియోజకవర్గంలోని వివిధ మండలాలలో టీజీఎస్, ఎన్పీడీసీఎల్ మరమ్మత్తులు, అభివృద్ధి పనుల కోసం రూ 47.15 లక్షల నిధులు మంజూరు అయినట్లు మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ తెలిపారు. మంథని మండలంలోని శ్రీపాద కాలనీకి రూ. 2.5 లక్షలు, ముత్తారం మండలంలోని మచ్చుపేటకు (బగుల్ల గుట్ట)రూ 12 లక్షలు, కమాన్ పూర్ మండలంలోని రొంపికుంటకు రూ. 9.5 లక్షలు, రామగిరి మండలంలోని రాజాపూర్ కు రూ. 5.40 లక్షలు, లద్నాపూర్ కు రూ. 6.30 లక్షలు, గొల్లపల్లి కి రూ. 1.70 లక్షలు, సుందిళ్లకు రూ. 3.5 లక్షలు, రామయపల్లికి రూ 4.16 లక్ల నిధులు మంజూరైనట్లు ఆయన వివరించారు. ఈ ప్రాంత అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న శ్రీధర్ బాబు నిధులు మంజూరు చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో చేపట్టనున్న పనులను త్వరలోనే ప్రారంభించినట్లు వివరించారు.