calender_icon.png 23 April, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

23-04-2025 01:07:30 AM

మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి) నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి నిధు లు మంజూరు చేయాలని  మంగళవారం  సచివాల యంలోని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ను తన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రసిద్ది గాంచిన శ్రీ. ఓదెల మల్లిఖార్జున స్వామి వారి దేవాలయ అభివృద్ధి తో పాటు ఆలయంలో నిత్యం పూజలు నిర్వహించే ఒగ్గు పూజారుల సమస్యల పరిష్కారించాలని, అలాగే నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్ధి పనుల గురించి మంత్రి కి ఎమ్మెల్యే తెలియజేశారు