calender_icon.png 30 October, 2024 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి

07-07-2024 12:07:36 AM

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యేల వినతి

కూకట్‌పల్లి/ఎల్బీనగర్, జూలై 6: జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని శనివారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. నియోజకవర్గంలోని చెరువులు, కుంటల్లో పెరిగిపోయిన గుర్రపు డెక్కని తొలగించాలని, దోమలను నివారించాలని, డివిజన్లలో విద్యుత్తు స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అదే విధంగా ఎల్బీనగర్‌లో కొత్తగా రెండు ఫ్లుఓవర్లు నిర్మించాలని, తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి రూ.200 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంత్రిని కోరారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, అరికెపూడి గాంధీ, మర్రి రాజశేఖర్, కేపీ వివేకానంద పాల్గొన్నారు.