calender_icon.png 13 February, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధులు మంజూరు చేయండి

13-02-2025 12:00:00 AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 

రాజేంద్రనగర్,  ఫిబ్రవరి 12: పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.  బుధవారం ఉదయం ఆయన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు. 

తన నియోజకవర్గం లోని మైలార్ దేవ్ పల్లి నుంచి దుర్గా నగర్ వరకు ఫ్లై ఓవర్ నిర్మాణంతో పాటు ఆరంఘర్ దగ్గర రెండు ఆర్ యు బి ల నిర్మాణానికి గత ప్రభుత్వం 259 కోట్ల కోట్లతో పనులు మంజూరు చేసింది కానీ నిధులు విడుదల చేయలేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

మైలార్దేవ రపల్లి నుంచి దుర్గా నగర్ వరకు ప్రయా ణించే వాహనదారులు, స్థానికులు ప్రతి రోజు తీవ్ర ట్రాఫిక్‌తో ఇక్కట్లకు గురవుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు  పార చారులు రోడ్డు దాటడం కూడా కష్టంగా మారిందన్నారు.

ఈ నేపథ్యంలో  సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సత్వరమే నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలో నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్  తెలియజేశారు.