calender_icon.png 28 December, 2024 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందస్తు బెయిల్ ఇవ్వండి

29-10-2024 01:51:16 AM

  1. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్ కుమార్ 
  2. వివరణ ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆరో నిందితుడైన ఐ న్యూస్ మాజీ ఎండీ ఏ శ్రవణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. శ్రవణ్‌కుమార్ పిటిషన్‌పై వివర ణ ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పిటిషనర్‌కు కింది కోర్టు బెయిల్ ఇచ్చేందుకు ఇటీవల నిరాకరించింది.

పిటిషనర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉండ గా, రెండు రోజుల క్రితం అతని పాస్‌పోర్టు రద్దయ్యింది. దీంతో పిటిషనర్ దేశానికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తనను పోలీసులు అరె స్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారించారు.

పిటిషనర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఏవిధమైన సంబంధం లేదని, గత ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ అధికారులకు పిటిషనర్ సూచనలు, ఆదేశాలు ఇవ్వలేదని లాయర్ పేర్కొన్నారు. ఇతర పార్టీల కు చెందిన వారిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఒత్తిళ్లు తేలేదని చెప్పారు.

ఇతర నిం దితులు ఇచ్చిన వాంగ్మూలాలు వాస్త వం కాదని అన్నారు. కేసులో ఇరికించే కుట్రగా పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తానని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనల తర్వాత పోలీసులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.