calender_icon.png 5 April, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గమ్మ ఆలయానికి గ్రానైట్ అందజేత

02-04-2025 12:00:22 AM

 మహబూబాబాద్. ఏప్రిల్ 1: (విజయ కాంతి ) మహబూబాబాద్ జిల్లాలోని కేసంద్రం మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారి గుడి తండా లో నిర్మిస్తున్న కనకదుర్గమ్మ ఆలయానికి సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ గ్రానైట్ అందజేశారు.ఈ సందర్భంగా తండావాసులు శాలువాతో సత్కరించి దుర్గమ్మ ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుతూ మాజీ వార్డు సభ్యులు బద్రు నాయక్ మాట్లాడుతూ మండలంలోని ఎన్నో గ్రామాలకు  అడిగితే లేదనకుండా సహృదయంతో గ్రానైట్ లేదా విరాళాలు అందించి ఆయా గ్రామాల గ్రామదేవతల ఆశీస్సులు ప్రజల మన్ననలు పొందిన ఏకైక వ్యక్తి అని అన్నారు. కార్యక్రమంలో బానోత్ బద్రు,బానోతు వెంకన్న (డోజర్), గుగులోత్ బద్రు,భూక్య రవి,బానోత్ మోహన్, బానోత్ సుక్య,తేజావత్ పవన్,బానోత్ రమేష్, బాధావత్ వెంకన్న భానోత్ తులసి రామ్, కొండేటి కళాధర్ తదితరులు పాల్గొన్నారు.