19-10-2024 11:01:45 AM
హైదరాబాద్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరధిలో శనివారం దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధిరాలి హత్యకు గురైంది. రావకొల్ లో గంజాయి మత్తులో వృద్ధురాలిని మనవడు హత్య చేశాడు. పింఛన్ డబ్బులు కోసం బాలమ్మను తలపై కొట్టి హత్య చేశాడు. నిందితుడిని ప్రశాంత్ గా గుర్తించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.