19-03-2025 01:51:46 AM
కొత్తపల్లి, మర్చి 18: కొత్తపల్లి గ్రామ శివారులో ఈనెల 15న హత్యకు గురైన వృద్ధురాలి కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం నాడు రాత్రి అరెస్టు చేశారు. కొత్తపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రొబేషనరీ ఐపిఎస్ అధికారిని వసుంధర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ కు చెందిన తనుకు వెంకటమ్మ (70) తనకు మగ పిల్లలు లేకపోవడంతో బిడ్డ కొడుకు అయిన తనుకు చంద్రశేఖర్ (31) ని కొన్ని సంవత్సరాల కిందట దత్తత తీసుకుని, గత నాలుగేళ్ల క్రితం దత్తత చంద్రశేఖర్‌కు వివాహం జరిపిం చింది.
తన వద్ద ఉన్న బంగారం, డబ్బులు ఆడబిడ్డలకే ఇస్తోందని, తనకు అన్యాయం చేస్తోందంటూ తరచూ గొడవపడుతు న్నాడు. చంద్రశేఖర్ అమ్మమ్మతో గొడవపడి గత సంవత్సర కాలంగా భార్యతో కలిసి కరీంనగర్ లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల వెంకటమ్మ కోహెడ మండలం రామచంద్రపూర్ లో ఉన్న బంధువుల వద్దకు వెళ్లి ఉంంటోంది. ఈనెల 15న మనవడు ఆయిన చంద్రశేఖర్ ఎల్‌ఐసి డబ్బులు వచ్చాయంటూ ఫోన్లో చెప్పి వెంటనే కరీంనగర్ కు రావాలని చెప్పాడు.
బంధువులు ఆమెను కరీంనగర్ కు బస్సు ఎక్కించారు. మనవడు చంద్రశేఖర్ అమ్మమ్మ రాక కోసం తన స్నేహితుడి వద్దనుండి కారును తీసుకొని ఆమె రాకు కోసం బస్టాండ్ లో ఎదురు చూశాడు. వెంకటమ్మ బస్సు దిగగానే జగిత్యాలకు వెళ్లి డబ్బులు తీసుకురావాల్సి ఉన్నట్టు చెప్పి ఆమెను కారులో ఎక్కించుకొని వెళ్లాడు. అక్కడ అధికారులు అందుబాటులో లేరని చెప్పి సాయంత్రం వేళ తిరుగు ప్రయాణం అయ్యారు.
ముందే అనుకున్న పథకం ప్రకారం కొత్తపల్లి శివారు ఎస్‌ఆర్‌ఎస్పి కెనాల్ వద్దకు చేరుకోగానే తనకు మూత్ర విసర్జన వస్తోందంటూ కారును ఆపి తను దిగి ఆమెను కూడా దిగుమని చెప్పాడు. విసర్జన చేస్తున్నట్లు నటించి వెనుక నుంచి వచ్చి వృత్తురాలు మెడభాగంలో కత్తితో నరికాడు.
ఆ తర్వాత గదువ భాగంలో కూడా కత్తితో నరికాడు. ఈ సంఘటనలో ఆమె తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందింది. హత్య చేసిన అనంతరం చంద్రశేఖర్ కారును తన స్నేహితుడికి అప్పగించి వరంగల్ కు పయనం అయ్యాడు. రెండు రోజులుగా పోలీసులు గాలించి అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.