బుడాపెస్ట్ (హంగేరి): 45వ చెస్ ఒలింపియాడ్ పోటీల్లో భారత గ్రాండ్ మాస్టర్లు సత్తా చాటుతున్నారు. ఓపెన్ కేటగిరీతో పాటు, మహిళల కేటగిరీలో కూడా తొలి నాలుగు రౌండ్లు గెలిచిన భారత ప్లేయర్లు ఐదో రౌండ్లో కూడా గెలుపు దిశగా సాగుతున్నారు. భారత పురుషుల జట్టు తొలి రౌండ్‌లో 4 తేడాతో మొరాకోను, రెండో రౌండ్లో 4 తేడాతో ఐస్‌ల్యాండ్‌ను, మూడో రౌండ్లో 3.5 తేడాతో హంగేరీ నాలుగో రౌండ్లో 3.5 తేడాతో సెర్బియాను మట్టికరిపించింది.
మహిళల జట్టు మొదటి రౌండ్లో 3.5 తేడాతో జమైకా మీద, రెండో రౌండ్లో 3.5 తేడా తో చెక్ రిపబ్లిక్ మీద, మూడో రౌండ్లో 3 తేడాతో స్విట్జర్లాండ్ మీద, నాలుగో రౌండ్లో 3.5 తేడాతో ఫ్రాన్స్ మీద విజయం సాధించింది. ఐదో రౌండ్లో పురుషుల జట్టు అజర్‌బైజాన్‌తో తలపడుతుం డగా, మహిళల జట్టు కజకిస్తాన్‌తో తలపడుతోంది.