calender_icon.png 3 April, 2025 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రంజాన్ వేడుకలు

01-04-2025 12:00:00 AM

మసీదులు, ఈద్గాల్లో ముస్లింల పూజలు

జనగామ, మార్చి 31(విజయక్రాంతి): రంజాన్ వేడుకలను జనగామ జిల్లా వ్యాప్తం గా ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే ముస్లింలు ఈద్గాలు, దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు వారికి ఖురాన్ని సందేశాన్ని వినిపించారు. ముస్లింలు హిందువులను తమ ఇండ్లకు వింధుకు ఆహ్వానించారు. ఒకరినొకరు అలయ్‌బలయ్ ఇచ్చుకుని శుభాకాంక్షలు తెలు సుకున్నారు. జనగామ ఎమ్మెల్యే కొందరి ఆతిథ్యం మేరకు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పలువురి ఇండ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని గీత నగర్ లోని ఈద్గా వద్ద కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్  ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ నితిన్ చేతన్  కలెక్టర్‌కు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జనగామలోని సిద్దిపేట రోడ్డులో గల ఈద్గా వద్ద ముస్లింలకు టీడీపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు జేరిపోతుల కుమార్, ఎండీ.కలీం, ఇక్బాల్, సిరాజ్, బైరు బాబు, చీకట్ల నవీన్, సౌమిత్రి, శ్రీనివాస్, కొమురయ్య ఉన్నారు.

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

హనుమకొండ : ఈరోజు రంజాన్ పర్వదినం సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామునూర్ లక్ష్మిపురం గ్రామంలోని ఈద్ -గా - గుల్షన్ ఈద్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ముఖ్య అతిధిలుగా పాల్గొన్న  వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. అనంతరం మాట్లాడుతూ రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ అని తెలిపారు. రంజాన్ మాసంలో ఆచరించి ప్రార్థనలు, ఉపవాసం క్రమశిక్షణను ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు తమ పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అలాగే నేను ఈ ప్రాంతం నుంచి పెరిగి ఉన్నత విద్యలను అభ్యసించి నా చిన్నతనం నుంచి ఎన్నో క్రీడలో పాల్గొన్ని ఒక హకీ ప్లేయర్ గా అంతర్జాతీయ స్థాయిలో వెళ్లడం నాకు చాలా ఆనందకరమని ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వడం నాకు చాలా సంతోషకరమని అన్నారు.

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదిన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా, దేశంలోనే అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ పర్వదినం రోజున ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సోదరులకు కోరారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చెవ్వు శివరామకృష్ణ, ముస్లిం పెద్దలు బాబా భాయ్, జమీర్, సిధిక్,అఫ్జల్, ఎం.డి సర్వర్, ఎం.డి నయీముద్దీన్, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో 

హనుమకొండ : హనుమకొండ లోని వివిధ డివిజన్లలో  పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. హనుమకొండ బొక్కల గడ్డ లోని ఈద్గాలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని   సామూహిక ప్రార్థనలు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. అనంతరం కాజీపేటలో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొని ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా రంజాన్ ఉపావాసదీక్షలు చేసి నేటితో వీడ్కోలు పలుకుతున్న సందర్భంగా  అల్లాహ్ ఎల్లప్పుడూ మీకు ఆయురారోగ్యాలు,సుఖ సంతోషాలతో ఎప్పుడూ ఇలా కలిసి మెలిసి ఉండాలని  వరంగల్ జిల్లా లో ఉన్న వారంతా హిందూ-ముస్లీందరూ  భాయ్- భాయ్ అనే భావనతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

మతాలు వేరైనా మనుషులంతా ఒకటే 

మతాలు వేరైనా మనుషులంతా ఒకటేనని,సమాజంలో ఒకరికొకరు చేయూతనందించుకుంటు ముందుకు సాగితేనే దేశ భవిష్యత్ బాగుంటుందని ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామచంద్రునాయక్ అన్నారు.సోమవారం ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పర్వదినం సందర్భంగా మరిపెడ ఈద్గాలో ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డారు.కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షే మానికి కట్టుబడి ఉందని,వారి అభ్యున్నతి కోసం ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. అంతే కాకుండా తన గెలుపులో భాగస్వాములైన ముస్లిం సోదరులకు తన చేతనైనంత సాయం అంది స్తానని,అందులో భాగంగానే మున్సిపాలిటీ కేంద్రంలోని సీతారాంపురం కాలనీలో నూతన మసీదు కోసం 130 గజాల స్థలం హౌసింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి కేటాయించినట్లు తెలిపారు.

అదేవిధంగా మరో 50 గజాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మరిపెడ మండలంలోని ముస్లిం సోదరుల విజ్ఞప్తి మేరకు వచ్చే రంజాన్ లోపు మున్సిపల్ కేంద్రంలో షాది ఖానా,లేదా ఖబ్రస్తాన్ ప్రహరీ ఏదో ఒక నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలోని గ్లోబల్ పాఠశాలలో మైనార్టీ నాయకులు షేక్ అఫ్జల్, ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈద్ దావత్ కార్యక్రమానికి హాజరై సేమియా,విందు ఆరగించారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్ద మౌలానా బదీ ఉజ్జమా, కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి,పట్టణ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్, మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్,కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ పెద్దబోయిన ఐలమల్లు,జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు రవినాయక్,మూడు మండలాల ఇంఛార్జి కాలం రవీందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్,మాజీ ఎంపీటీసీ గంధసిరి అంబరీష, కాంగ్రెస్ నాయకులు వీసారపు శ్రీపాల్ రెడ్డి,కొంపెళ్లి సురేందర్ రెడ్డి,గండి వీరభద్రం, అలువాల ఉపేందర్,కొండం దశరథ,బొడ్డు వెంకన్న, కారంపుడి ఉపేందర్, దేవరశెట్టి లక్ష్మినారాయణ, జర్పుల విజయ్,మైనార్టీ నాయకులు అజీజ్,సర్వర్, యాకుబ్ పాష, యువనాయకులు కుడితి నర్సింహారెడ్డి,రవికాంత్, జాటోతు సురేష్,బల్లెం రవి పాల్గొన్నారు.

నూతన  దుస్తులు, తీపి వంటకాలతో వేడుకలు

మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి కొత్తగూడ మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ పండుగ వేడుకలను ఘనంగానిర్వహించుకున్నారు. సోమవారం ముస్లింల పవిత్ర రంజాన్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థన సందర్భంగ కొత్తగూడ  మజీద్ ఏ అర్ఫాత్ అధ్యక్షులు మహ్మద్ అజ్మీర్ సమక్షంలో అంగరంగ  వైభవంగా ఈద్ గాలను  హంగు అర్బటాలతో  ఏర్పాటు చేశారు. గత నెల రోజుల పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు ఆదివారం నాటితో ముగియడంతో సోమవారం రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు  వేకువ జామున  తల స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి  చిన్న పెద్ద అంతా కలిసి  ప్రత్యేక ఈదుల్ ఫితర్ నమాజు కై  కొత్తగూడ ఈద్ గా చేరుకున్నారు. మౌలానా ముదస్సిర్ ఖురాన్ పటించి ప్రత్యేక నమాజ్ ఈదుల్ ఫితర్ నమాజ్ పాటించారు. చిన్న, పెద్ద అంతా  ఒకరికొకరు  శుభాకాంక్షలు తెలుపుకొని  అలై బలై  చేసుకు న్నారు.

అక్కడి నుండి నేరుగా ముస్లిం సోదరులంతా ఖబ్రస్తాన్ చేరుకొని  సమాధుల వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం తమ తమ ఇళ్లను చేరుకొని తల్లి దండ్రుల ఆశీర్వాదం తీసుకొని కుటుంబ సభ్యులకు, బందువులకు శుభాకాంక్షలు తెలియజేసి ఇరుగు పొరుగు వారికి తీపి పదార్థాలు పంపించి  ఇళ్లల్లో వండిన రకరకాల వంటకాలు  కుటుంబ సమేతంగా  ఆరగించారు.ఈ వేడుకల్లో ముస్లీం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో యాకుబ్ పాషాలు, సర్వర్, పాషా, దస్తగిరి, అన్వర్, హైమద్, టియుడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల అద్యక్షులు సల్మాన్ పాషా, ఖాజా, సయ్యద్, పాల్గొన్నారు.