calender_icon.png 15 March, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబరానంటిన హోలీ సంబురాలు

15-03-2025 12:05:34 AM

రంగులు పూసుకున్న కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే...

కేరింతల మధ్య యువకుల వేడుకలు.. 

ఆదిలాబాద్, మార్చ్ 14 (విజయ క్రాంతి) : రంగుల కేలి హోలీ పండుగ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్న...పెద్దా...అడా.. మగ అనే తేడా లేకుండా ఒకరిపై ఒక రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. యువకులు కేరింతల మధ్య హోలీ పండుగ వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. అటు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు హోలీ పండుగ వేడుకలను ఆనంద ఉత్సవాల మధ్య జరుపుకున్నారు. కలెక్టర్, ఎస్పీ క్యాంపు కార్యాలయాల్లో హొలీ సంబరాలు అంబరాన్ని తాకాయి.  జిల్లా కలెక్టర్ ఎస్పీ లు ఒకరికొకరు రంగులు చూసుకుంటూ హోలీ వేడుకలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా పోలీసులు, ఇతర ఉద్యోగులు కలెక్టర్, ఎస్పీ లకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరో వైపు ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి తదితరులు కలెక్టర్, ఎస్పీ లకు రంగులు పూసి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సైతం హోలీ పండుగ వేడుకలు పాల్గొన్నారు.

హోలీ వేడుకలలో సీపీ, డీసీపీ

మంచిర్యాల, మార్చి 14 (విజయక్రాంతి) : పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో హోలీ సంబరాలు శుక్ర వారం ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకి మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ రంగులు పోసి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు, సిబ్బంది పరస్పరం రంగులు పూసుకొని బ్యాండ్ వాయిద్యాలతో పోలీస్ కమిషనర్, అధికారులు, సిబ్బంది, అందరు ఆనందంతో నృత్యాలు చేశారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు, వెల్లువిరియాలని, ఈ హోలీ పండుగ మీ జీవితాలను రంగులమయం చేయాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో మంచిర్యాల డిసిపీ ఎగ్గడి బాస్కర్, అడిషనల్ డిసిపి (అడ్మిన్) సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఎసిపి ఎం రమేష్ , ట్రాఫిక్ ఎసిపి నర్శింహులు, టాస్క్ ఫోర్సు ఎసిపి మల్లా రెడ్డి, సీఐలు, ఆర్.ఐలు, సిసి హరీష్,  ఎస్.ఐ, ఆర్ ఎస్ ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో..

బెల్లంపల్లి, మార్చి 14 (విజయక్రాంతి) : బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుండే పట్టణంలోని పలు వార్డులను యువకులు బ్యాండ్ మేళాలు మోగిస్తూ రంగులను చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. బెల్లంపల్లి తిలకు క్రీడా మైదానంలో తిలక్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి చిన్నారులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఆర్యవైశ్యులు రంగులు చల్లుకుంటూ వేడుకలు హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ రవి కుమార్ తో కలిసి స్థానిక ప్రెస్ క్లబ్ సభ్యులు , పోలీసులు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణం లోని బజార్ ఏరియాలో వికె స్పోరట్స్ క్లబ్ సభ్యులు రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టణంలోని వ్యాపారస్తులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్టెప్పులేస్తూ రంగులు చల్లుకొని హోలీ వేడుకలను జరుపుకున్నారు. పలుచోట్ల వ్యాపా రులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు , నాయకులు, యువకులు అంబరాన్నంటేలా జరుపుకున్నారు.

పొన్నారం లో 

మందమర్రి(విజయక్రాంతి) : మండలంలోని పొన్నారం గ్రామపంచాయతీ పరిధిలో రంగుల కేళి హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుండి గ్రామంలోని యువకులు మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు జరుపుకుంటూ ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలు నిర్వహించారు. పండుగ సందర్భంగా యువకులు చిన్నారులు రంగు లు చల్లుకుంటూ సందడి చేశారు. యువకులు రంగులు చల్లుకుంటూ ఒకరినొకరు  ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఫీల్ అసిస్టెంట్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఈద లింగయ్య ఆద్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకలు పలువురిని ఆకట్టుకున్నాయి. గ్రామంలోని యువకులు ఉత్సాహంగా హోలీ వేడుకలలో పాల్గొని రంగులు చల్లుకున్నారు. ఈ కార్యక్రమంలో పెంచాల మధు, గడ్డం శ్రీనివాస్, బర్ల కిష్ట స్వామి, పెంచాల రాజు, చిందం శంకర్, పెంచాల శ్రీనివాస్, పెంచాల అనిల్, కురుమిళ్ళ శంకర్ లు పాల్గొన్నారు.