calender_icon.png 23 December, 2024 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు

23-12-2024 06:16:10 PM

జెండా ఆవిష్కరించిన జిఎం దేవేందర్...

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఏరియాలోని గనులు డిపార్ట్ మెంట్ లలో ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం ఏరియా జిఎం కార్యాలయంలో, సింగరేణి హై స్కూల్ మైదానంలో ఏరియా జనరల్ మేనేజర్ జి.దేవేందర్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి కార్మికులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సింగరేణి సంస్థకు సంబంధించిన పలు డిపార్ట్మెంట్ల  స్టాల్స్ ను, తినుబండారాల  స్టాల్స్ ను, సేవా స్టాళ్లను ఏరియా జిఎం తో కలిసి సేవా అధ్యక్షురాలు జి.స్వరూపరాణి దేవేందర్ లు ప్రారంభించారు.

అనంతరం జిఎం మాట్లాడుతూ.. ఉద్యోగుల శ్రమతోనే బొగ్గు వెలికి తీసే స్థాయి నుండి ప్రపంచ దేశాలతో దీటుగా అత్యాధునిక యంత్రాలను ఉపయోగించే స్థాయికి సింగరేణి ఎదిగిందని ఆయన స్పష్టం చేశారు. దేశాలలోని బహిరంగ గనులలో అన్ని బొగ్గు గనులకు దీటుగా సింగరేణి సంస్థ పని చేస్తుందన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి ధ్యేయంగా కాకుండా చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి కూడా బాధ్యతగా పనిచేస్తుందన్నారు. సింగరేణి ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరగడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, రామకృష్ణాపూర్ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, సిఎంఓఏఐ అధ్యక్షులు రవి, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, డివైపిఎం ఆసిఫ్ అన్ని డిపార్ట్ మెంట్ల హెచ్ఓడీలు, ఏరియా అధికారులు, జి.ఎం కార్యాలయం సిబ్బంది, సింగరేణి ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.