calender_icon.png 26 February, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మహా శివరాత్రి వేడుకలు

26-02-2025 08:48:54 PM

పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రంగారెడ్డి...

ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ పరిధిలోని శివాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. బుధవారం వివిధ గ్రామాలతో పాటు యాచారం మండలం నందివనపర్తి గ్రామంలోనీ నందీశ్వర ఆలయంలోని శివుడిని దర్శించుకుని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ.. శివుడి అనుగ్రహంతో పంటలు బాగా పండాలని, నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాచర్ల వెంకటేశ్వర్లు, బిలకంటి శేఖర్ రెడ్డి, ఏదుల్ల పాండురంగారెడ్డి, గుండ్ల ధనరాజ్, కాంగ్రెస్ పార్టీ, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

దండుమైలారంలో..

మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలోని ప్రాచీన శివాలయంలో ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు శ్రీ రావినూతల వంశీధర్, ఆలయ రాజపోషకులు తాడూరి జనార్ధన్ రెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో అభిషేకాలు, సాయంత్రం శ్రీశ్రీ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులకు కళ్యాణ మహాత్సవం, రాత్రి లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రి వరకూ స్వామి వారి దర్శనం కోసం గ్రామ ప్రజలతో పాటు నగర పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.