calender_icon.png 26 February, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మహా శివరాత్రి వేడుకలు

26-02-2025 08:03:57 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలో మహాశివరాత్రి వేళ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. బుధవారం గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి పరమశివుని దర్శనం కోసం శివాలయంలో భక్తులు బారులు తీరారు. శివరాత్రి ఉత్సవాలకు ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలుగోందాయి. పుణ్య స్థానాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పర్వదినం శివ నామస్మరణలతో శైవ క్షేత్రాలు మారుమోగాయి. సాంబశివాలయంలో దర్శనానికి భక్తులు బారులు తీరారు.

గోదావరి తీర ప్రాంతం వద్ద మహాశివరాత్రి సందర్భంగా భారీ ఏర్పరిచారు. గంగాదేవి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. వేకువజామున లేచి పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు శివాలయానికి దారులు తీశారు. అన్ని శైవక్షేత్రాలు శివ నామస్మరణలతో మార్మోగిపోయింది. శైవక్షేత్రాల వద్ద భక్తులు ముక్కంటి దర్శనానికి బారులు తీరారు. ఏ శైవక్షేత్రం చూసినా సరే భక్తుల క్యూలైన్​లతో కనిపించింది. అదే విధంగా వివిధ ఆలయాల్లో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తులు ఆచరించారు.