calender_icon.png 13 January, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంబురంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు..

12-01-2025 07:19:32 PM

విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాయం..

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలో పలు ఏరియాల్లో ఆదివారం సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొని రంగురంగుల రంగవల్లులతో తీర్చిదిద్దారు. ముగ్గుల పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు(MLA Payam Venkateshwarlu) విజేతలకు బహుమతులు అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మణుగూరు పట్టణంలోని 220 కేవి సబ్ స్టేషన్ ఏరియాలో లైన్స్ క్లబ్ ఆఫ్ లెజెండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఆ ప్రాంత మహిళలు పాల్గొని ఉత్సాహంగా ముగ్గులు వేశారు. ఈ పోటీలో ప్రధమ విజేత ధనలక్ష్మికి రూ 5 వేలు, ద్వితీయ బహుమతి సాధించిన అనితకు రూ 3 వేలు, తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్న ఉదయశ్రీ, నాగ దర్శనీలకు రూ.వేయి చొప్పున ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సభ్యులు కాంగ్రెస్ మహిళా మండలి నాయకులు పాల్గొన్నారు.

పినపాకలో...

పినపాక మండల పరిధిలోని సింగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ మద్దులగూడెంలో కేబిఎస్ సహకారంతో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, ముగ్గుల పోటీలకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రికెట్ క్రీడలో ప్రథమ బహుమతిని గెలుపొందిన బయ్యారం జట్టుకు 20,000 ద్వితీయ బహుమతిని సాధించిన మధ్యలో కూడా జట్టుకురు 10,000 వాలీబాల్ పోటీలో ప్రథమ బహుమతిని సాధించిన పాండురంగాపురం జట్టుకు రూ.20, వేలు ద్వితీయ స్థానంలో నిలిచిన బయ్యారం జట్టుకు రూ.10 వేలు మూడో స్థానంలో గెలుపొందిన మధ్యలో కూడా జట్టుకు రూ.5 వేలు అందజేశారు. అదేవిధంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వై కుమారికి రూ.5 వేలు, ద్వితీయ స్థానం సాధించిన కే వైష్ణవి రు.3 వేలు, తృతీయ స్థానంలో గెలుపొందిన వై శ్రీదేవికి రూ.2 వేలు, నాలుగో స్థానం సాధించిన పీ మౌనికకు రూ. వేయి నగదు బహుమతిని ఎమ్మెల్యే పాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ... క్రీడాకారులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలను సక్రమంగా నిర్వహించి గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏడుళ్ళ బయ్యారం ఎస్సై రాజకుమార్, మండల అధ్యక్షులు రామనాథం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.