calender_icon.png 2 February, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2025 11:22:57 PM

మందమర్రి (విజయక్రాంతి): 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం బీఎస్పీ చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కాదాసీ రవీందర్ మాట్లాడుతూ... భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26ను గుర్తుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం మైనార్టీలందరు ఐక్యతతో రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో బీఎస్పీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఐక్యంగా రాజ్యాధికారం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సింగతి  రంగనాథ్, రామిల్ల రాజేష్, గోపిశెట్టి రాజేష్, బోర్లకుంట రాజలింగం, గొల్లపెల్లి ఓదెలు, కర్రేవుల వినయ్, జస్వంత్, శౌర్య తేజలు పాల్గొన్నారు.