calender_icon.png 27 January, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

26-01-2025 07:04:39 PM

జాతీయ జెండా ను ఎగురవేసిన జిల్లా కలెక్టర్..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ లోని పోలీస్ పరేడ్ మైదానంలో ఆదివారం నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజార్షిషా జాతీయ జెండాలు ఎగురవేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, ఎస్పీ గౌస్ ఆలం, ఎంపీ గెడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజా రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మువ్వనేల జెండాను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఉత్తమ ఉద్యోగులకు అతిథులు బహుమతులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా వివిధ ప్రభుత్వ శాఖల నిర్వహించిన శకటాలు పలువురిని ఆకట్టుకున్నాయి.