లక్షేట్టిపేట (విజయక్రాంతి): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఆయా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, పలు కుల సంఘాలు, వ్యాపార సంఘాలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, న్యాయస్థానంలో జడ్జి అసదుల్ల షరీఫ్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దిలీప్ కుమార్, పోలీస్ స్టేషన్ లో సీఐ నరేందర్, ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాస్, డీసీఎమ్మెస్ కార్యాలయంలో చైర్మన్ తిప్పని లింగయ్య, ఐక్య వ్యాపార సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు మైలారం సుధాకర్, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు ముల్కల రాందాస్, నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు నడిగొట్టు అంజన్న, వెంకన్నలు, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ సరోజ, సబ్ జైలు లో జైలర్ స్వామి, ప్రెస్ క్లబ్ వద్ద అధ్యక్షుడు బోనగిరి కుమార్, నాయి బ్రాహ్మణ సంఘం వద్ద ప్రెసిడెంట్ నడిగోట్టు అంజన్న, జాతీయ జెండా ఆవిష్కరించి వందనం చేశారు.