calender_icon.png 26 February, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2025 04:40:39 PM

చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల మండల కేంద్రమైన చర్లలో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగరవేసి దేశభక్తిని చాటుకున్నారు. రాహుల్ విద్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండగ నిర్వహించారు. మొదటగా పాఠశాల ప్రాంగణంలో రాహుల్ స్కౌట్ అండ్ గైడ్స్ జాతీయ పతాకానికి గౌరవ వందనం చేయగా ప్రధానాచార్యులు వర్మ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గణతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి కార్యక్రమ ప్రాముఖ్యతను విద్యార్థిని, విద్యార్థులకు తెలియజేసారు. అనంతరం చాక్లేట్స్, మిఠాయిలు పంచడం జరిగింది. రాహుల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో పాఠశాల నుండి తహసీల్దార్ కార్యాలయం మీదుగా పాతచర్ల గాంధీ బొమ్మ సెంటర్ వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్బంగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు పాఠశాల ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం సందర్బంగా కవాతు నిర్వహించిన రాహుల్ విద్యార్థులు అలాగే స్కౌట్ మాస్టర్ ఉస్మాన్ పలువురు గ్రామ పెద్దలు, తల్లిదండ్రుల నుండి ప్రశంసలు అందుకున్నారు. తదుపరి రాహుల్ విద్యార్థులు జాతీయ భావాలు పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు, గణతంత్ర దినోత్సవంను ఘనంగా నిర్వహించిన పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులకు చైర్మన్ డాక్టర్ డి ఎన్ కుమార్, డాక్టర్ ప్రతిభ, ఏడ్యుకేషనల్ డైరక్టర్ టీవీపీసీ శాస్త్రిలు వారి అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎంవీల్  నరసింహ రావు, గురజాల పట్టాభి రామారావు బిట్రగుంట క్రాంతికుమార్, అద్దంకి బోస్ బాబు, శ్రీధర్ ఆనంద్, దగ్గుపల్లి రాజా, శెట్టి సునీత, మాధురి, గొట్టిపాటి ఉష, రమ, చైతన్య, సౌజన్య, స్వాతి, లావణ్య, సంధ్య, కోమలి తదితర ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.