calender_icon.png 23 December, 2024 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంద్రవెల్లిలో జమ్మి చెట్టుకు ఘనంగా పూజలు

13-10-2024 12:09:00 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో శనివారం విజయదశమి పండుగ సందర్భంగా జమ్మి చెట్టుకు గ్రామస్తులు ఘనంగా పూజలు చేశారు. తమ పేర్లతో రాసిన పత్రాలను జమ్మి చెట్టు వద్దనే వదిలేసి వచ్చే విజయదశమి వరకు పాడిపంటలతో గ్రామంలోని ప్రతి ఇల్లు కళకళలాడాలని వేడుకున్నారు. జమ్మి చెట్టుకు పూజలు చేసిన అనంతరం గ్రామస్తులు ఒకరికొకరు చేతిలో జమ్మి ఆకు పెట్టి ఆనందోత్సవాలతో పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. జమ్మి చెట్టు వద్ద అలాయ్ బలాయ్ తీసుకుని నవరాత్రుల్లో 9 అవతారాల్లో దర్శనమిచ్చిన అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించి ప్రత్యేకమైన పూజలు చేశారు. గ్రామంలో శోభాయాత్ర నిర్వహించి ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొమ్మెర లక్ష్మణ్, దాసరి సత్యనారాయణ గౌడ్ , తాళ్లపల్లి అశోక్ గౌడ్ లతో పాటు పలువురు నాయకులు, గ్రామస్తులు, యువకులు ఉన్నారు.